భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. వన్డే ప్రపంచకప్ నాకౌట్‌లలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డుల్లో నిలిచింది. 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నిర్ధేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ రికార్డు ఇదివరకు న్యూజీలాండ్ మెన్స్ జట్టుపై ఉంది. ఆక్లాండ్ వేదికగా 2015 ప్రపంచకప్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై 298 రన్స్ కివీస్ ఛేదించింది. ఈ రికార్డును భారత…