ఇరాన్‌లోని కెర్మాన్ నగరంలో బుధవారం జరిగిన రెండు పేలుళ్లలో 100 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. జనరల్ ఖాసిం సులేమాని వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పేలుళ్లు జరిగాయి. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీ మరణించారు. అతను రివల్యూషనరీ గార్డ్స్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్‌కు అధిపతి. ఆయనను కెర్మాన్‌లో ఖననం చేశారు.