పండగ వేళ కేంద్ర ప్రభుత్వ, రైల్వే ఉద్యోగులతో పాటు అన్నదాతలకు కేంద్ర శుభవార్త తెలిపింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు సహా , రైల్వే ఉద్యోగులకు బోనస్, రబీ సీజన్‌లో ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంపు వంటి వాటికి కేబినెట్ ఆమోదం తెలిపింది.