ఎండీఎంఏ డ్రగ్ అత్యంత ప్రమాదకరమైంది అని వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్ అన్నారు. ఎండీఎంఏ మత్తు మందును తీసుకుంటే 24 గంటలు పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి.. అంతేకాదు ఇటీవల కాలంలో మెట్రో నగరాలు ఈ డ్రగ్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది అని ఆయన వ్యాఖ్యనించారు.