Home
West Indies Cricket
West Indies Cricket News
-
Shai Hope: “మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ”.. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
Shai Hope: భారత్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసిన వెస్టిండీస్ జట్టు ప్రదర్శనపై కెప్టెన్ షాయ్ హోప్ చాలా సంతృప్తి వ్యక్తం చేశాడు. కేవలం సిరీస్‌లు గెలవడమే కాకుండా, జట్టులో వస్తున్న పురోగతిని కూడా విజయాలుగానే భావించాలని అభిప్రాయపడ్డాడు. బెంగళూరులో జరగాల్సిన ఐదో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో మ్యాచ్ డ్రాగా మిగిలిన విషయం తెలిసిందే. భారత్గడ్డపై గత రెండు దశాబ్దాలకు పైగా దక్కని ద్వైపాక్షిక సిరీస్ విజయం కోసం… -
IND vs WI: వర్షం దెబ్బ.. ఇషాన్ కిషన్ విధ్వంసం వృథా! డ్రాగా ముగిసిన టీ20 సిరీస్..
IND vs WI: వర్షం కారణంగా మ్యాచ్ రద్దవడంతో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. ఇషాన్ కిషన్ కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ ఆఖరి మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో, ఓవర్లను కుదించి ఒక్కో వైపునకు తొమ్మిది ఓవర్ల చొప్పున మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 7.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి… -
Shai Hope: 248 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
భారత్‌తో జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో అద్భుత విజయంతో సిరీస్‌ను సమం చేసిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ పర్యటనలో తాను తరచూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఆ భారీ ట్రోఫీలతో స్వదేశానికి వెళ్లేటప్పుడు లగేజ్ బరువు సమస్యగా మారుతుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఇన్నింగ్స్ ఆరంభంలో జట్టుకు బలమైన పునాది అందించడమే తన ప్రధాన లక్ష్యమని,… -
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
India vs West Indies 4th T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. షాయ్ హోప్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వేగంగా పరుగులు సాధిస్తూ భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన… -
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్‌కప్ బెర్త్ కోసం పాకులాట!
ODI World Cup 2027: ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను ఏకచక్రాధిపత్యంతో ఏలిన వెస్టిండీస్ జట్టు పూర్వ వైభవాన్ని సంతరించుకునే సూచనలు ఎంతకీ కనిపించడం లేదు. రెండుసార్లు వన్డే ప్రపంచకప్, రెండుసార్లు టీ20 ప్రపంచకప్ గెలిచిన కరేబియన్ జట్టు.. వచ్చే ఏడాది జరగనున్న 50 ఓవర్ల వన్డే ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని మరోసారి చేజార్చుకుంది! ఐసీసీ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికి వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచే జట్లతో పాటు, ఆతిథ్య… -
2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రతిష్టాత్మక 2027 వన్డే ప్రపంచకప్ అర్హత పోటీల ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా 2027 ప్రపంచకప్ క్వాలిఫైయర్ టోర్నీని ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. అయితే ఈ టోర్నీ వేదికను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2027 ప్రపంచకప్ అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు 12 వేదికల్లో జరగనుంది. నయా ఫార్మాట్… -
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు దూరం కావడంపై వెస్టిండీస్ ప్రధాన కోచ్ డారెన్ సమీ, జోసెఫ్ మధ్య వివాదం చెలరేగింది. జోసెఫ్ జట్టుకు ఎంపిక కావడానికి నిరాకరించాడని సమీ చేసిన వ్యాఖ్యలను అల్జారీ జోసెఫ్ తీవ్రంగా ఖండించారు. సమీ చేసిన ప్రకటన వివాదాస్పదమని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు (క్రికెట్ వెస్టిండీస్) అధికారికంగా తాను ‘వ్యక్తిగత కారణాల’ వల్లే అందుబాటులో లేనట్లు పేర్కొందని జోసెఫ్… -
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Sir Garfield Sobers: క్రికెట్ సామ్రాజ్యంలో ఒక సుదీర్ఘమైన, అద్భుతమైన అధ్యాయం ముగిసింది. ఒకే ఓవర్లో 6 బంతులకు 6 సిక్సర్లు బాదిన ప్రపంచపు మొట్టమొదటి క్రికెటర్‌గా, వెస్టిండీస్ క్రికెట్ ముఖచిత్రాన్ని మార్చేసిన దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (సార్ గ్యారీ సోబర్స్) ఇకలేరు. బార్బడోస్‌లోని తన నివాసంలో ఆయన కన్నుమూసినట్లు సోబర్స్ కుమారుడు డానియెల్ ధృవీకరించారు. మరో పది రోజుల్లో 90వ వసంతంలోకి అడుగుపెట్టాల్సి ఉండగా ఇంతలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో… -
New Country: ఐసీసీ సభ్యత్వం పొందిన మరో దేశం.. మొత్తం 111కు చేరిన సంఖ్య..
ఎడిన్బర్గ్ (స్కాట్లాండ్) వేదికగా జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వార్షిక సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆటను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా మారిషస్‌ను తన 111వ సభ్య దేశంగా ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాలనాపరమైన సంస్కరణలతో పాటు ఆర్థిక సాయం, మరికొన్ని దేశాల సభ్యత్వంపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. గవర్నెన్స్ రివ్యూ కమిటీ ఏర్పాటు: ఐసీసీ సరికొత్త గవర్నెన్స్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి… -
Shai Hope: చరిత్ర సృష్టించిన షాయ్ హోప్.. అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలిసారి!
రెండో వన్డేలో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో నిలిచింది. వెస్టిండీస్ ఓటమి పాలైనప్పటికీ.. సెంచరీ సాధించిన కెప్టెన్ షాయ్ హోప్‌కు మాత్రం ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. హోప్ సెంచరీ చేయడమే కాకుండా.. లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా సాధించలేని రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్‌గా హోప్ రికార్డుల్లో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో…
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..