ED vs West Bengal Govt: పశ్చిమ బెంగాల్‌లో ఈడీ vs బెంగాల్ ప్రభుత్వం వార్ నడుస్తోంది. ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ చేసిన దాడుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని ఈడీ కోరుతోంది. ఇప్పటికే ఈ అంశంపై కలకత్తా హైకోర్టును కూడా ఈడీ ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై జనవరి 14న విచారణ జరగనుంది.