Tummala Nageswara Rao :తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ‘వర్కర్ టూ ఓనర్’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హైదరాబాద్‌లో సమావేశమై పథకం అమలుపై చర్చించారు. ఈ పథకం ద్వారా గతంలో నిర్మించిన వీవింగ్ షెడ్లలో పవర్ లూమ్స్‌ను ఏర్పాటు చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందజేయనున్నారు.…