అంతర్జాతీయ క్రికెట్లో మరో పదేళ్లు భారత జట్టుకు ఎలాంటి డోకా లేదని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (బీసీఈ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. మరో పదేళ్లు భారత్ ఆధిపత్యం చెలాయించడానికి కావాల్సినంత మంది ఆటగాళ్లు దేశంలో ఉన్నారన్నారు. పురుషుల్లోనే కాదు మహిళల క్రికెట్లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారని చెప్పారు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం బీసీఈ శిక్షణ శిబిరంలో భారత మహిళల జట్టు తీవ్రంగా శ్రమించిందని లక్ష్మణ్ తెలిపారు. బీసీఈ కొత్త సెంటర్‌ను ప్రారంభించిన…