విశాఖలో ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై యావత్ ఆంధ్రరాష్ట్రం భగ్గుమంటోంది. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో విద్యార్ది లోకం రోడ్డెక్కారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం కానివ్వబోమని గర్జించారు. విశాఖ ఏవిఎన్ కాలేజ్ నుండి పాత పోస్టాఫీసు వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. పలు విద్యార్ది యూనియన్ లకు చెందిన జాతీయ స్థాయి నాయకులు కూడా ఈ నిరసన లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ ఎఫ్…
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించ వద్దని కార్మికులు, ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం దిగిరాకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఇప్పటికే కార్మికులు ప్రకటించారు. ఇందులో భాగంగానే విశాఖలో ర్యాలీలు, నిరసన దీక్షలు చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే రాజ్యసభలో ఇదే విషయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈరోజు కూడా పార్లమెంట్‌లో మరోసారి స్పష్టంగా…