మొంథా తుఫాన్ ప్రభావంతో విశాఖ తీరం వెంబడి ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో విశాఖలో వర్షం మొదలైంది. మొంథా తుఫాను బలహీనపడి.. తీవ్ర అల్పపీడనంగా మారింది. రానున్న 24 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావం పూర్తిగా తొలిగేవరకు నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలుజారీ చేశారు. మొంథా తుఫాను ప్రభావంతో…
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం తీరానికి సమాంతరంగా వెళుతున్న కారణంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికలు ఉండడంతో.. రైతుల్లో టెన్షన్ పెరుగుతోంది. కోత కోసి పొలాలలో ఆరబెట్టిన వరి పంట దెబ్బతింటుందని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల మొలకలు వచ్చే పరిస్థితి నెలకొంది. పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో వర్షాలు…