ప్రముఖ తమిళ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వివేక్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణవార్తతో సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఆకస్మిక మృతి బాధాకరం అంటూ ట్వీట్ చేశారు. ఈ మేరకు మోడీ “ప్రముఖ నటుడు వివేక్ అకాల మరణం చాలా మందిని బాధపెట్టింది. అతని కామెడీ టైమింగ్, ఇంటెలిజెంట్ డైలాగులు…