ముద్దు గుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. చెన్నై అమ్మడు అయినప్పటికి తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుందనే చెప్పాలి. ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నత్రిష, ప్రస్తుతం చిరంజీవి సరసన ‘విశ్వంభర’ అనే చిత్రం…