పోర్ట్ సిటీ విశాఖపట్నంలో అధికార వైసీపీ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. తూర్పు, దక్షిణ నియోజకవర్గాల కుమ్ములాటలు కొలిక్కి రాకముందే పశ్చిమంలో ముసలం పుట్టింది. మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ విజయప్రసాద్‌కు హైకమాండ్ షాక్ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పించి ఆ స్ధానంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌ను నియమించింది. “గడపగడపకు” ప్రభుత్వం కార్యక్రమం సమన్వయం చెయ్యాలని శ్రీధర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి.…