Bangladesh: బంగ్లాదేశ్‌లో రాడికల్ గ్రూపులు ఢాకాలోని భారత హైకమిషన్‌పై దాడికి యత్నించారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు బారికేడ్లను దాటుకుని రాయబార కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. వీసాల జారీ ప్రక్రియ నిలిపివేతను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఎంబసీని ముట్టడించారు. గత కొన్ని రోజులుగా భారత రాయబార కార్యాలయానికి ఆ దేశంలోని పలువురు నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీలోని బంగ్లా రాయబారి రియాజ్ హబీబుల్లాను భారత విదేశాంగ శాఖ పిలిపించి, పరిస్థితిపై ఆందోళన…