Virat Kohli Statue installed at Jaipur Wax Museum: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. గురువారం (ఏప్రిల్ 18) జైపూర్‌లోని వ్యాక్స్ మ్యూజియంలో విరాట్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ‘కింగ్’ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాస్తవ తెలిపారు. 35 కిలోల బరువున్న భారత మాజీ కెప్టెన్ మైనపు విగ్రహం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.…