Sriharikota: శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి.. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు సీఐఎస్‌ఏఫ్ ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడంతో.. అసలు షార్ సెంటర్‌లో ఏం జరుగుతోంది? అనే ఆందోళన మొదలైంది.. అయితే, ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు.. ఆత్మహత్యలపై విచారణ చేపట్టారు.. చెట్టుకు ఊరివేసుకుని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కానిస్టేబుల్ చింతామణి ఆత్మహత్య చేసుకున్నారు.. 29 ఏళ్ల చింతామణి 2021లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు.. శిక్షణానంతరం శ్రీహరికోటలోని యూనిట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు..…