Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సమీపంలో అగ్నిప్రమాదం జరిగింది. వేములవాడ పట్టణంలోని జాతర మైదాన ప్రాంతంలోని ఆలయ వసతి గృహాల్లో అగ్నిప్రమాదం జరిగింది.
ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలోని రాజరాజేశ్వరస్వామిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే రాజన్నను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడ రాజన్నను కూడా కేసీఆర్ మోసం చేశారని ఆయన ఆరోపించారు.
వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే వేడుకల్లో మొదటి రోజు శుక్రవారం శివనామస్మరణతో పట్టణం మార్మోగింది. స్వామివారి గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను రద్దు చేశారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ కార్తీక మాసోత్సవ సందర్భంగా ముస్తాబైంది. కార్తీక మాసం శివుడికి ఎంతో ప్రీతికరమైన నెల కావడంతో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయాన్ని విద్యుత్‌దీపాలంకరణలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. ఆలయంలో నెల రోజుల పాటు స్వామి వారి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి వారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో…