ఏలూరు నుంచి వారాహి రెండో దశ యాత్ర ప్రారంభం కానుంది. 9న ఏలూరులో పవన్ కల్యాణ్ సభ జరుగుతుంది. రెండోదశ యాత్ర ప్రణాళికపై ఈరోజు జనసేన నేతలతో పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా చర్చించారు. గత 14 న అన్నవరంలో తొలిదశ ప్రారంభమైంది. ఈనెల 9న ఏలూరు సభతో రెండో దశ వారాహి యాత్ర ప్రారంభించాలని నిర్ణయించారు.