బెజవాడ రాజకీయాలు…వంగవీటి రంగా చుట్టూ తిరుగుతున్నాయ్. ఆ ఘటన జరిగి మూడు దశాబ్దాలు గడిచినా…దాన్ని రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయ్. అవసరాన్ని బట్టి రంగా అంశాన్ని బయటికి తీసి…ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయ్. ఇటీవల రంగా హత్యోదంతంపై ప్రత్యర్థులు…దేవినేని నెహ్రూను టార్గెట్ చేశారు. దీనిపై ఆయన తనయుడు దేవినేని అవినాష్…తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో దేవినేని కుటుంబాన్ని విలన్లుగా చూపుతూ రాసే కథనాలు.. చేసే కామెంట్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఈ హెచ్చరికల ముఖ్య ఉద్దేశ్యం అంటున్నారు.…