ఆమదాలవలస వైసీపీ కార్యాలయంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియా సమావేశం నిర్వహించారు. మిథున్ రెడ్డి అరెస్టుపై ఆయన స్పందించారు. వంశీ, పూసాన కృష్టమురళి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా అనేక మంది నాయకులు అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు సిగ్గులేని పాలన చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. లూటీలు, హత్యలు పెరుగుతున్నాయని..
గడిచిన 115 రోజులుగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఉద్దేశ్యపూర్వకంగా జైలులో ఉంచారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఎలాగైనా ఆయన్ని ఇబ్బందులు పెట్టాలని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.. పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడారు. ఒక కేసులో బెయిలు వస్తుందంటే మరో కొత్త కేసు నమోదు చేస్తున్నారన్నారు.. కేసు మీద కేసు అంటూ తప్పుడు కేసులు పెడుతున్నారని.. వంశీ విషయంలో దేవుడు ఉన్నాడు..