ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి పన్నెండవ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది. రైతులు తలపెట్టిన పాదయాత్రకు ఒంగోలు నగరంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి రైతులకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, జనసేన,సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆనాడు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామనే హామీవల్లే తమ విలువైన భూములు ఇచ్చామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు…