హిందూపురం గ్యాంగ్ రేప్‌పై మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీ చరణ్ స్పందించారు. ఇద్దరు మహిళలపై గ్యాంగ్‌రేప్ అత్యంత దుర్మార్గం, విజయదశమి రోజు స్త్రీని పరాశక్తిగా కొలిచే ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు.
రాష్ట్రంలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఒక్కర్ని బుజ్జగిస్తే.. మరో ఇద్దరు తెరపైకి వస్తున్నారు. తాజాగా ఈ పునర్వ్యస్థీకరణ రచ్చ.. అనంతపురం జిల్లాను కూడా తాకింది. నిన్నటి వరకు జిల్లాలో ఎలాంటి అలజడులు కనిపించ లేదు కానీ.. ఇప్పుడు ఏకంగా ఆవివాదం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంద్ లకు కూడా దారి తీసింది. ఏపీలో మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణ వైసీపీకి పెద్ద తలనొప్పిలా మారింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా…