H-1B visa fee hike: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై కఠిన చర్యలు తీసుకున్నారు. H-1B వీసాలపై USD 100,000 (రూ. 88 లక్షలకు పైగా) వార్షిక రుసుము విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఇది ప్రధానంగా నైపుణ్యం కలిగిన భారతీయ వర్కర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే, ఈ నిర్ణయంతో అమెరికా సెల్ఫ్ గోల్ చేసుకుందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇది భారత్‌కు కలిసి వస్తుందని అంటున్నారు.