Lara Williams: హైదరాబాద్‌లో కొత్త యుఎస్ కాన్సుల్ జనరల్‌గా లారా విలియమ్స్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో యుఎస్ కాన్సుల్ జనరల్‌గా పనిచేయడం తనకు ఎంతో గర్వకారణమన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అంతటా యుఎస్-ఇండియా భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.