కృష్ణా నదీ జలాల కేటాయింపులో భాగంగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించడంతోపాటు తెలంగాణకు న్యాయం చేసేందుకు తక్షణమే కొత్త ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేయాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఈరోజు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, పార్టీ తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి…