Bhatti Vikramarka: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో శ్రీ భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రతి యేటా తమిళనాడులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాల మాదిరిగా, ఇకపై ప్రతి సంవత్సరం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా భక్త రామదాసు జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని, ఇందులో ప్రముఖ సంగీత…