బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 ను జూలై 5న విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఆ తర్వాత.. ఇప్పుడు టీవీఎస్ (TVS) మోటార్ కంపెనీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొదటి గ్రౌండ్-అప్ సీఎన్జీ స్కూటర్‌ను తయారు చేయాలని యోచిస్తోంది. టీవీఎస్ మోటార్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలపై పని చేస్తోంది.