Delhi Car Blast: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బాంబు దాడికి పాల్పడిన ఉగ్రవాది ఉమర్ మొహమ్మద్ గురించి ఓ ప్రధాన అంశం వెల్లడైంది. ఉమర్ పేలుడుకు ముందు ఓల్డ్ ఢిల్లీలోని ఒక మసీదుకు వెళ్ళాడు. ఎర్రకోట వైపు వెళ్ళే ముందు 10 నిమిషాలకు పైగా అక్కడే గడిపాడు. ఇది ఫైజ్-ఎ-ఇలాహి మసీదు. తుర్క్మాన్ గేట్ ఎదురుగా రాంలీలా మైదాన్ మూలలో ఉంది. నిజాముద్దీన్ మర్కజ్ లాగానే ఈ మసీదులో తబ్లిగీ జమాత్ జరుగుతుందని చెబుతున్నారు.…