“టక్ జగదీష్” ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్ము దులుపుతోంది. చిత్ర ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఉమ్మడి కుటుంబం నివసించే భూదేవిపురం కథను, తన తండ్రి కోరిక మేరకు భూదేవిపురాన్ని ప్రతీకార రహిత గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యతను టక్ జగదీష్ తీసుకుంటాడని చూపించారు. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ లతో పాటుగా నాని, రీతూ వర్మ మధ్య రొమాన్స్ వంటి అంశాలు కూడా ట్రైలర్‌లో ఉన్నాయి. బాధ్యతాయుతమైన పాత్రలో నాని, హీరోయిన్ రీతూ వర్మ బాగున్నారు. జగపతి…
“మజిలీ” ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ డ్రామా “టక్ జగదీష్”. నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం అందించారు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే లాభాలు తెచ్చినట్టు టాక్. అత్యంత హైప్ నెలకొన్న మూవీ…