నేచురల్ స్టార్ నాని 25వ చిత్రం ‘వి’ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 5న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. సరిగ్గా యేడాది తర్వాత మళ్ళీ అందులోనే ‘టక్ జగదీశ్’ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటరా? ఓటీటీనా? అనేది తేల్చుకోలేక కొన్ని నెలల పాటు సతమతమైన నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది చివరకు ఓటీటీ వైపే మొగ్గు చూపారు. దాంతో ఎగ్జిబిటర్స్ నుండి కాస్తంత వ్యతిరేకత ఎదురైనా… వెనక్కి తగ్గకుండా వినాయక చవితి కానుకగా ‘టక్ జగదీశ్’ను వ్యూవర్స్…