ప్రజలు అన్న మాటలే నేను, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. సిట్ అంటే సీఎం సిట్ అంటే సిట్... స్టాండ్ అంటే స్టాండ్ అంటూ ఎద్దేవ చేశారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సమగ్రంగా దర్యప్తు చేస్తున్న సిట్ కు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. మొత్తం 9 మందిని వేరు వేరు ప్రదేశాల్లో తీసుకువెళ్లి విచారిస్తున్న సిట్ కు రోజుకో ట్విస్ట్ ఎదురవుతుంది. వరుసగా నాలుగు రోజుల విచారణ జరిపిన సిట్ ఇవాళ 5వ రోజుకు చేరింది. సిట్ వేగం పెంచడంతో ఉత్కంఠ నెలకొంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా నవీన్ కుటుంబీకులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను నవీన్ తండ్రి నాగభూషణం ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి శవరాజకీయాలు చేయకండి అని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు.
Tspsc బోర్డ్ సభ్యలందరు రాజీనామా చేయాలని పెన్ డ్రైవ్ లో ఎక్కించెంత వరకు ఏం చేసారు? అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండి పడ్డారు. విద్యార్థుల కళ్ళలో కేసిఆర్ మట్టి కొట్టారని సంచలన వ్యాఖ్యాలు చేశారు.