TG SSC : తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు ఒక శుభవార్త. వారి ఫలితాలకు సంబంధించిన విధానంలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటివరకు కేవలం గ్రేడ్లు , సీజీపీఏ (CGPA – Cumulative Grade Point Average) రూపంలో మాత్రమే ఫలితాలను పొందుతున్న విద్యార్థులకు ఇకపై ఒక్కో సబ్జెక్టులో వారు సాధించిన మార్కులు, వాటికి కేటాయించిన గ్రేడ్లు కూడా మెమోలో స్పష్టంగా తెలియజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఒక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించగా, ప్రభుత్వం…