Greenland issue: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను డెన్మార్క్ దేశానికి చెందిన ద్వీపమైన ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై పడింది. తమ జాతీయ భద్రత కోసం గ్రీన్‌ల్యాండ్ కావాల్సిందే అని ట్రంప్ చెబుతున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరిస్తున్నారు. అయితే, అమెరికా దుందుడుకు చర్యలపై యూరప్ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తు్న్నాయి. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో డెన్మార్క్ సభ్యదేశంగా ఉంది. సభ్యదేశంగా ఉన్న డెన్మార్క్‌పై దాడి చేస్తే ఇది నాటో భవితవ్యాన్నే ప్రశ్నార్థకం చేస్తుందని యూరప్…