తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఇటీవల వరుసగా జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ వచ్చిన నాటి నుంచి అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ తన పట్టును మరింత బిగించేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. ఆ పార్టీలోని విభేదాలు బయట పడుతున్నాయి. వర్గ పోరు, అధిపత్య పోరుతో టీఆర్‌ఎస్‌లో లుకలుకలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే తాజాగా.. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని గులాబీ నేతల మధ్య అధిపత్య పోరుతో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు…