Ramesh Kumar BJP: వికారాబాద్ జిల్లాలో జరిగే కేసీఆర్ పర్యటనను అడ్డుకుంటామని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. గడిచిన ఎన్నికల్లోతాండూర్ లో మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని హామీ ఇచ్చి సీఎం విస్మరించారని మండిపడ్డారు. వికారాబాద్ కు కేటాయించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటికే తాండూరులో అధునాతన ఆసుపత్రి భవనాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్రాంతంలో పూర్తి అయ్యేదని గుర్తు చేసారు.…