Rain Alert : నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వచ్చే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో ముడిపడి, ద్రోణి మధ్య కోస్తా ఆంధ్ర తీరం వరకు ఏర్పడిందని తెలిపింది. ఇది సముద్రమట్టానికి 1.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని వివరించింది.…