2019 అసెంబ్లీ ఎన్నికలు దెందులూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. తనకు ఎదురే లేదని అనుకున్న టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఓడిపోగా.. అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కొఠారు అబ్బయ్య చౌదరి గెలిచారు. వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో.. సీన్ మారిపోయింది. దెందులూరులో పొలిటికల్ గేమ్ కూడా ఆ స్థాయిలో రక్తికట్టిందనే చెప్పాలి. ఇప్పటికీ నియోజకవర్గంలో నేతల మధ్య రాజకీయ చదరంగం నడుస్తోంది. అయితే, గత ఎన్నికల్లో ఓడినా దూకుడు తగ్గించని…