రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్.. టార్గెట్ ఇదే..! ఆంధ్రప్రదేశ్ మరోసారి అధికారమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు సీఎం వైఎస్ జగన్.. అందులో భాగంగా ఇప్పటికే గడపగడపకు ప్రభుత్వం పేరుతో ప్రతీ ఇంటికి ప్రజాప్రతినిధులు వెళ్లి తమ ప్రభుత్వ హయాంలో చేకూర్చిన లబ్ధిని తెలియజేస్తున్నారు. ఇక, మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని…