Air India flight: టోక్యో హనేడా ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక సమస్యల్ని ఎదుర్కొంది. దీంతో విమానాన్ని కోల్‌కతాకు మళ్లించారు. ఢిల్లీకి వస్తున్న AI357 విమానంలో ప్రయాణికులు, సిబ్బంది క్యాబిన్ లో ఉష్ణోగ్రత పెరగడాన్ని గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానాన్ని కోల్‌కతాలో ల్యాండ్ చేశారు.