CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిజరూప దర్శనం కోసం వేచి ఉన్న భక్తులపై అకస్మాత్తుగా గోడ కూలడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన భక్తులను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటన భక్తజనంలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. విషాదకర ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.…