Vijayawada: విజయవాడలోని ప్రసిద్ధ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదివారం ఈవో రామ్ చంద్ర మోహన్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో సెక్యూరిటీ సదుపాయాల లోపం కనిపించడంతో ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ ఏఈఓ చంద్రశేఖర్‌ను క్లూ లైన్ల పరిశీలన సమయంలో కనిపించకపోవడంతో ఆయనకు చార్జ్ మెమో జారీ చేశారు. అంతేకాదు, అంతరాలయం ఎదుట ఉన్న హుండీని తొలగించాల్సిందిగా రెండుసార్లు ఆదేశించినా అధికారులు పట్టించుకోకపోవడాన్ని ఈవో తప్పుబట్టారు.…