తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలు ఈ రోజు జరగబోతున్నాయి. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రొగ్రెసివ్ ప్యానల్ పేరుతో పోటీపడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తుండగా…. ఈ ఎన్నికలు పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమని ప్రొగ్రెసివ్ ప్యానల్ లో ఉన్న అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు. దీంతో మరోసారి ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.…