వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం నుంచి సినీ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టాలీవుడ్‌లో షూటింగ్స్ నిలిచిపోయాయి. ప్రస్తుతం 28 సినిమాల చిత్రీకరణలు జరుగుతుండగా, ఈ సమ్మె కారణంగా వాటి షూటింగ్ ఆగింది. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ సీరియస్ అయ్యింది. ఈరోజు నుంచి యధావిధిగా షూటింగ్‌లో పాల్గొనాలని కార్మికుల్ని కోరింది. లేకపోతే ఆరు నెలల పాటు పూర్తిగా షూటింగ్స్ నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నిర్మాతలెవ్వరూ కార్మిక సంఘాల ఒత్తిళ్లకు గురి కావొద్దని…