తెలంగాణ యూనివర్సిటీలో అవుట్ సోర్సింగ్ పేరుతో ఇటీవల చేసిన నియామకాలు చెల్లవని చెప్పింది ప్రభుత్వం. అయితే నియామకాలేవి చేపట్టలేదంటూ ప్రకటించారు వీసీ. విద్యార్థి సంఘాలు, పాలకవర్గ సభ్యులు అక్రమ నియామకాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. అసలు తెలంగాణ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం వీసీపై ఎందుకు సీరియస్ అయ్యింది?నిజామబాద్ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ నిశ్వవిద్యాలయంలో ఔట్ సోర్సింగ్ నియామకాల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్, రిజిస్ట్రార్ ఉద్యోగాలను అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెలువెత్తాయి.…