Weather Updates : సంక్రాంతి పండుగ ముగిసినా, తెలుగు రాష్ట్రాలను చలి వదలడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి, ప్రజలు ఆహారపు జాగ్రత్తలు పాటించేందుకు, వేడి బట్టలు ధరించేందుకు మక్కువ చూపుతున్నారు. ఆరెంజ్ అలర్ట్ జారీ: తెలంగాణలో సోమవారం తెల్లవారుజాము నుంచి చలి తీవ్రత అధికంగా నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.…