గాలి ద్వారా కరోనా వేగంగా విస్తరిస్తోందని… ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. మహారాష్ట్ర పరిస్థితి తెలంగాణలో నెలకొనే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాస్కులు ధరించాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెబుతున్నారు. తెలంగాణలో నాలుగు వారాలుగా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని అన్నారు. ప్రజలు సహకరించకపోతే తెలంగాణ కూడా మహారాష్ట్ర మారే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.…