మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఘటన ఇప్పుడు స్థానికంగానే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ సర్పంచ్ పదవికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియలో జరిగిన తీవ్ర పొరపాట్ల కారణంగా, ఒకే గ్రామానికి ఇద్దరు సర్పంచ్‌లు ఉన్నట్లు అధికారికంగా నమోదు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే… గూడూరు మండలం దామరవంచ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున మొదటగా బీఆర్ఎస్ మద్దతుదారు స్వాతి మూడు…