ఇంటి పన్ను వసూలు చేయడంలో మున్సిపల్ కార్పొరేషన్ చూపిస్తున్న శ్రద్ధ, రోడ్ల మరమ్మత్తులో చూపడం లేదంటూ కరీంనగర్ ప్రజలు తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. రోడ్లపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో, వాటిలో వరి నాట్లు వేస్తూ 9వ డివిజన్‌లోని నివాసితులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.