Sangareddy: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగిసింది. అయినా కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం మన నాయకులు చెత్త పాలనకు అద్దంపడుతోంది. గిరిజన గ్రామాల్లో సైతం రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది.
KMC Hospital : రాష్ట్ర స్థాయిలో పేరొందిన వరంగల్ KMC సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో నెల రోజులుగా తీవ్ర అసౌకర్య పరిస్థితులు నెలకొన్నాయి. ఆసుపత్రిలోని సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ పూర్తిగా పనిచేయడం నిలిచిపోయింది. ముఖ్యంగా చిల్లర్స్ మోటార్ రిపేర్‌లో ఉండటంతో మొత్తం ఆసుపత్రి అంతటా ఏసీలు పనిచేయకపోవడం, తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఆసుపత్రిలో రోజూ నిర్వహించాల్సిన సర్జరీలు పూర్తిగా నిలిచిపోయాయి. సాధారణ చికిత్సలకే కాదు, అత్యవసర శస్త్రచికిత్సలకూ అవకాశం లేకుండా పోయింది. దీని వల్ల వైద్యులు…