పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ఏప్రిల్‌లో జైలు నుండి విడుదల అవుతారని ఆ పార్టీ కీలక నేత సర్దార్ లతీఫ్ ఖోసా వెల్లడించారు. తోషాఖానా కేసులో మాజీ ప్రధానికి విధించిన శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది, అయితే సైఫర్ కేసు ఒక వారం కూడా నిలబడదని ఖోసా ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు